అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన ముఠా అరెస్ట్

గోల్డెన్ న్యూస్ / నల్గొండ / జిల్లాలోని పీఏపల్లి మండలం వద్దిపట్ల పలుగు తండాకు చెందిన రమావత్ మధునాయక్, అతని బావలు భరత్, బాబు, రమేశ్‌లతో కలిసి గిరిజనులను లక్ష్యంగా చేసుకుని ముఠాగా ఏర్పడ్డారు. గోకులనందన ఇన్ఫ్రా ఐడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి, అధిక వడ్డీ హామీ ఇస్తూ కోట్ల రూపాయలు మోసం చేశారు. ఈ డబ్బుతో లగ్జరీ కార్లు, భూములు, భవనాలు కొనుగోలు చేసి, ఐపీఎల్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్‌లో నష్టపోయారు. బాధితుల ఒత్తిడి పెరగడంతో మధునాయక్ పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram