నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రధాన పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు, బల్దియా పోరుకు ఈ ఉప ఎన్నిక కీలకం కావడంతో ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేస్తుండటంతో పోటాపోటీ నెలకొంది. నవంబర్ 11న జరిగే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఇవాళ్టితో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు గడువు ముగియనుంది. రేపటి నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన, 24 వరకు ఉపసంహరణకు సమయం ఉంది.

నవంబర్ 11న పోలింగ్.. నవంబర్ 14న కౌంటింగ్

Facebook
WhatsApp
Twitter
Telegram