జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ లో స్వర్ణపథకం సాధించిన శ్రీతేజ ను సన్మానించిన ఆటో యూనియన్
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన తోలెం.వెంకటేశ్వర్లు-మల్లేశ్వరి దంపతుల కుమార్తె శ్రీతేజ డిగ్రీ చదువుతూ,చదువుతో పాటు జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తుంది.ఇటీవల ఒడిస్సా రాష్టంలోని భువనేశ్వర్ లో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో సత్తా చాటి స్వర్ణ పథకం సాధించటం తెలిసిందే.మంగళవారం కరకగూడెం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రీతేజను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీతేజ క్రీడల్లో మరిన్నో పతాకాలు సాధించి,ఉన్నతమైన స్థానాలకి ఎదగాలని, భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కొమరం సాంబశివరావు, వైస్ ప్రెసిడెంట్ నిట్టా సౌందర్య రావు,సెక్రటరీ గుడ్ల రంజిత్ కుమార్,క్యాషియర్ సాధనపెల్లి లక్ష్మినారాయణ,ఆటో యూనియన్ సభ్యులు రావుల వేణు,కాటి సాంబశివరావు,ముత్యాల మధు,నిట్టా వెంకన్న,తోట శివ,బాదె సాగర్,ఓంకార్,శ్రావణ్,అదే విధంగా కరకగూడెం పంచాయితీ సెక్రెటరీ రామక్రిష్ణ తదితదులు పాల్గోన్నారు.









