పది రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం : మంత్రి పొంగులేటి

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం :  వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రారంభిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలం నేలపట్ల, ధర్మాతండాలో రోడ్ల నిర్మాణ పనులకు కలెక్టర్ అనుదీప్తోతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ధాన్యానికి మద్దతు ధరతోపాటు రైతులకు ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందని తెలిపారు. వరివేస్తే.. ఉరేనని రైతులను అధైర్యపర్చిన పరిస్థితుల నుంచి రైతును రాజును చేయాలనే సంకల్పంతో రేవంత్రెడ్డి సారాధ్యంలో ప్రజా ప్రభుత్వం రూ.21వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. పాలేరు నియోజకవర్గంలో శంకుస్థాపన చేసిన రహదారులన్నీ వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఆర్డీఓ నర్సింహారావు, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, ఎస్ఈలు యాకోబ్, వెంకటరెడ్డి, ఈఈ మహేష్, సీడీసీ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram