భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ అయింది. ఆ సమయంలో ఈ హెలికాఫ్టర్ ఒక వైపునకు భూమిలోకి కూరుకుపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమైయ్యారు. వారంతా కలిసి ఒరిగిపోయిన హెలికాఫ్టర్‌ను సరి చేశారు. దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ముర్ము.. హెలికాప్టర్ నుంచి కిందకి దిగారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది..
Post Views: 33









