తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు!

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణ లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

 

కాగా ఈ రోజు కూడా కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జనగాం, ములుగు, వరంగల్, భూపాల్‌పల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతే కాకుండా మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుండి మధ్యస్థంగా కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా హైదరాబాద్ లో మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో ఒకటి రెండు సార్లు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

 

కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. శనివారం వారం కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వివరించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram