కథలాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

గోల్డెన్ న్యూస్ /జగిత్యాల : శుక్రవారం ”పిఏం పోషణ్ పరిశీలనలో ” లో భాగంగా కథలాపూర్ కేంద్రంలోని లోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

 

విద్యార్థులతో నేరుగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్.

 

విద్యార్థుల ఆరోగ్యం, విద్యల పట్ల శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం భోజనం నిర్వహణను, వంట సరుకుల నాణ్యతను, స్టోర్ రూమ్ లో గల బియ్యం నాణ్యతను పరిశీలించి వంట నిర్వాహకులను ప్రభుత్వ ఆదేశానుసారం మెను ప్రకారంగా, శుభ్రమైన వాతావరణంలోనే విద్యార్థులకు వండి వడ్డించాలని సూచించారు.

 

పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు .

విద్యాలయం చుట్టూ ఉన్న పరిసరాల శుభ్రతను పరిశీలించారు.

 

విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన తీరు పట్ల కొన్ని విషయాలను తెలుసుకొని ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు.

 

ఇట్టి కార్యక్రమంలో కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, డిఈఓ కే. రాము, తహసిల్దార్ వినోద్ కుమార్, ఎంపీడీవో శంకర్, ఎంఈఓ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram