కర్నూల్ బస్ ప్రమాదం – జ్ఞాపకాలు

నిన్నటి వరకు వారు మనుషులు

జీవితం పైన ఆశలతో నిండినవారు,

ఇంటివాళ్లకు “వచ్చేస్తా” అని చెప్పి,

మరల కనిపించని దారిలో మాయమయ్యారు.

 

ఆ బస్సు చక్రాలు గమ్యాన్ని చేరలేకపోయాయి,

ఒక మోటార్ శబ్దం ఆపేసింది ప్రాణాల పయనాన్ని.

కలలతో బయల్దేరిన ఆ పాదాలు —

బూడిదగా మారి నిలిచిపోయాయి.

 

మంటల్లో కరిగిపోయింది మానవత్వం,

ధగధగలలో దాచుకుంది బాధ.

అరుపులు ఆగిపోయిన తర్వాత —

కన్నీళ్లు మాత్రమే మిగిలాయి ఆ మార్గంలో.

 

తల్లి ఎదురుచూస్తుంది కిటికీ తలుపు వైపు,

బిడ్డ పరిగెడ్తుంది తండ్రి పేరు పిలుస్తూ,

కానీ తిరిగిరారు వారు…

తిరిగి వస్తుందో ఆ జ్ఞాపకం మాత్రమే.

వారి ఆత్మలు వెలుగులా నిలవాలి.

ఆత్మలకు శాంతి కలగాలి…

Facebook
WhatsApp
Twitter
Telegram