♦. ప్రజలకు అండగా గులాబీ జెండా
♦గొల్లగూడెం గ్రామంలో గులాబీ జెండా ఆవిష్కరణ
ఏ ఎన్నికైన గులాబీ సైన్యం సొంతం
♦ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల పరిధిలోని సమాత్ మోతె(గొల్లగూడెం)గ్రామంలో గ్రామ కమిటి అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు, కార్యకర్తలతో కలిసి గులాబీ జెండాను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మలకం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని,ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ పార్టీ సొంతం చేసుకుంటుందని అన్నారు.ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని,ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి,సరైన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,పార్టీ కో-ఆర్డినేటర్ సుతారి నాగేష్,బట్టా బిక్షపతి,ఇర్ప సత్యం,ఇర్ప నాగేష్,కుంజ లక్ష్మయ్య,అంజయ్య,పుల్లయ్య,ఆదినారయణ,రమేష్,కుమారస్వామి,వంశీ,కుషేలుడు,మహళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









