హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషి మంత్రి సీతక్క

హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషిని ఓటర్లకి గుర్తు చేసిన మంత్రి సీతక్క

 

 

పిల్ల‌ల ఎదుగుద‌ల‌లో త‌ల్లి ప‌డే త‌ప‌న‌, తండ్రి ప‌డే క‌ష్టం ఎంత ఉంటుందో…హైద‌రాబాద్ ఎదుగుద‌ల‌లో కాంగ్రెస్ క‌ష్టం అంతే ఉందనీ పేర్కొన్న మంత్రి సీతక్క

 

 

హైదరాబాదులో వంద‌లాంది ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, అనుబంధంగా వేలాది కంపెనీలు, ల‌క్ష‌లాది ఉపాధి అవ‌కాశాలు కాంగ్రెస్ కృషి ఫ‌లితమే అన్న మంత్రి సీతక్క

 

• జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎన్నో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లను నెహ్రు గారు, ఇందిరా గాంధీ గారు ఏర్పాటు చేశారు.

 

హైద‌రాబాద్ అభివృద్దిని హ‌స్తాన్ని వేరు చూసి చూడ లేము. హ‌స్తంతోనే హైద‌రాబాద్ అభివృద్ది చెందింది… చెంద‌నుంది అని ఓటర్లకు హామీ ఇచ్చిన మంత్రి సీతక్క

 

జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాంగ్రెస్ గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని చెప్పిన సీత‌క్క‌

 

చిన్న మ‌ద్య తర‌హ ప‌రిశ్ర‌మ జాతీయ పరిశోధనా శిక్షణ సంస్థ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని యూసుఫ్ గూడ లో ఉంది. 1960 లో తొలి ప్ర‌ధాని ఇక్క‌డ ఏరి కోరి ఏర్పాటు చేశారు.దీని వ‌ల్ల మ‌న చుట్టు ప‌క్కల వేలాది చిన్న మ‌ద్య త‌ర‌హ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు అయ్యాయి. త‌ద్వారా ల‌క్ష‌లాది మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయి

 

కేంద్రీయ విద్యుత్ శిక్ష‌ణా సంస్థ జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోనే 1960 లో తొలి ప్ర‌ధాని నెహ్రు గారు ఇక్క‌డ ఏర్పాటు చేశారు. అప్ప‌ట్లో దేశంలో ఎక్కువ‌గా క‌రెంటు లేదు. అయితే ఇంటింటికి విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయాల‌న్న సంక‌ల్పంతో నెహ్రు గారు జూబ్లిహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని యూసుఫ్ గూడ లో కేంద్రీయ విద్యుత్ శిక్ష‌ణా సంస్థ ను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్ప‌త్తికి ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. దీంతో దేశ మంతా వెలుగులు నిండాయి. ఇప్పుడు మ‌న రేవంత్ అన్న ప్ర‌భుత్వం 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తోందన్న సీత‌క్క‌

Facebook
WhatsApp
Twitter
Telegram