తలపై కర్రతో కొట్టి, శవాన్ని బాత్రూములో పడేసి ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే కుట్ర
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ –మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ ప్రగతి నగర్ కాలనీలో, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటున్న అల్లంపల్లి విజయ్ కుమార్(42), సంధ్య దంపతులు
విజయ్ కుమార్ ఆటో నడుపుతుండగా, మున్సిపల్ శాఖలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న సంధ్య
కొంత కాలంగా తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఈ విషయంపై సంధ్యతో నిత్యం గొడవలు పెట్టుకోసాగిన భర్త విజయ్ కుమార్
మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి, సదరు సహోద్యోగిని బెదిరించడంతో, భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంధ్య
ఈ క్రమంలో విజయ్ కుమార్ మెడకు తాడు చుట్టి, ఊపిరాడకుండా చేసి హతమార్చి, అనంతరం కర్రతో తలపై కొట్టి బాత్రూమ్ వద్ద మృతదేహాన్ని పడేసి, ప్రమాదవశాత్తు పడిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించిన సంధ్య
అంత్యక్రియలకు సిద్ధం చేసే సమయంలో, ఇంట్లో ఉన్న తాడుకు రక్తం గమనించి, అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి
పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా, తానే భర్తను చంపినట్టు నేరాన్ని అంగీకరించిన సంధ్య









