బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన రహదారులు గోతులు పడి దెబ్బతిన్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం మణుగూరు పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధ్వంసమైన రహదారుల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టినట్లు తెలిపారు. రహదారి మరమ్మత్తులు తక్షణం చేపట్టకపోతే బిఆర్ఎస్ మరిన్ని ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 26









