గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : కామారెడ్డి జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ రేకులపల్లి జీవన్ రెడ్డి (37), తన భార్య ఏడాదిన్నరగా కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన ఆయన, అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ వెనకాల చనిపోయి కనిపించాడు. భార్యాభర్తల మధ్య గత రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, ఇటీవల విడాకుల నోటీసులు కూడా రావడంతో జీవన్ రెడ్డి తీవ్రంగా కలత చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
Post Views: 31









