గోల్డెన్ న్యూస్ / జడ్చర్ల, పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్ల పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులే కాకుండా తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం — అడ్డాకల్ మండలానికి చెందిన రాజశ్రీ (39) నారాయణపేట జిల్లా చెందిన శ్యాంసుందర్ తో వివాహం జరిగింది. రాజశ్రీ మిడ్జిల్ మండలం వెలుగొమ్ముల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా. భర్త వ్యాపార నిమిత్తం నారాయణపేటలో మెడికల్ షాప్ నడుపుతూ ఉంటే, రాజశ్రీ తన ఇద్దరు పిల్లలతో కలిసి జడ్చర్ల మూడో వార్డులోని వెంకటేశ్వర కాలనీలో అద్దె ఇల్లులో నివాసం ఉంటుంది.
సోమవారం ఉదయం పిల్లలను పాఠశాలకు పంపించిన అనంతరం రాజశ్రీ చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వచ్చిన పిల్లలు తలుపు తీయకపోవడంతో ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన కిటికీలో చూసే సరికి రాజశ్రీ ఉరేసుకున్న దృశ్యం కనబడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్సై మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకు దించి ఆధారాలు సేకరించింది. ప్రాథమిక దర్యాప్తులో రాజశ్రీ వాట్సాప్‌లో ఎవరో వ్యక్తితో వీడియో కాల్, చాటింగ్ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇక, రాజశ్రీ ఆత్మహత్యకు ముందు లేదా తరువాత ఎవరో వ్యక్తి ఇంటి తలుపులు కొట్టి, కిటికీలో నుంచి చూసి వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించిందని సమాచారం. దీంతో ఆ వ్యక్తి ఎవరు? ఆత్మహత్యకు సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఫోన్ డేటా, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాజశ్రీ మరణవార్త తెలుసుకున్న మిడ్జిల్ మండలం ఎంపీడీవో, సిబ్బంది, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పనితనంలో నిబద్ధత కలిగిన అధికారిణి ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిని కలిసి వేసిందని పేర్కొన్నారు.









