ఘనంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు.

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : తెలంగాణ రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కరకగూడెం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ , నియోజకవర్గ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి, ఎర్ర సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, బాణాసంచ కాల్చి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు  తెలియజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  శీనన్న ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని వారు ఆకాంక్షించారు.  అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు,పాలు,బ్రెడ్స్ ప్యాకేట్స్ పంపిణీ చేశారు.కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

 

Facebook
WhatsApp
Twitter
Telegram