గోల్డెన్ న్యూస్ / అశ్వరావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామంలో ప్రసాద్ అనే వ్యక్తి పెంచుతున్న నాలుగు కాళ్లతో ఉన్న కోడి పుంజును చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు.
ఈ పుంజు వింత ఆకృతిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో, పందెం రాయుళ్లు ఈ పుంజును చూసి దాని సామర్థ్యంపై చర్చించుకుంటున్నారు.
కొందరు దీనిని బ్రహ్మం గారి జోస్యంతో పోలుస్తుండగా, మరికొందరు దీనిని వింతగా అభివర్ణిస్తున్నారు
Post Views: 27









