గోల్డెన్ న్యూస్ / మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని గిరిజన బాలుర వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించిన పినపాక శాసనసభ్యులు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఎంతమంది ఉన్నారు..మెనూ వివరాలు రికార్డులో నమోదు చెయ్యాలి అని వార్డెన్ కు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. వసతి గృహాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.
Post Views: 34









