ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పరిశీలించిన ఖమ్మం పోలీస్ కమిషనర్.. సునీల్ దత్..
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు
బుధవారం కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు
కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగులో డీసీఎం వ్యాన్ పడిపోవడంతో స్థానిక పోలీసులను NDRF బృందలను అప్రమత్తం చేశారు
జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగాప్రవహిస్తుండటంతో
నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు
ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా మున్నేరు వరద ఉధృతి పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అపప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.









