డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన

గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమల్ల ఆశ్రమ పాఠశాలలొ గురువారం మణుగూరు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం అనే చైతన్యం కార్యక్రమం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ .. డ్రగ్స్ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు,ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు.చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు.యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు  సూచించారు. అలాగే ప్రభుత్వ భడి లొ చదివి మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నాము అని మీరు కూడా కస్టపడి చదివి ఉన్నత స్థానాలకి చేరుకొని మీ కుటుంబానికి మీ ఊరికి మరియు మీ స్కూల్ కి మంచి పేరు తీసుకు రావాలి  ఉన్నారు. కార్యక్రమం లొ ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర రావు, పివిఎన్ రావ్  ఎస్సై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్స్ విద్యార్థులు  పాల్గొన్నారు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram