ఫర్నిచర్ అసిస్టెంట్ 3 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్

ఫర్నిచర్ అసిస్టెంట్ మూడు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ –  యువతకు జిల్లా కలెక్టర్ పిలుపు

నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్. ఈ రెండవ విడత బ్యాచ్‌కు రిజిస్ట్రేషన్, వసతి మరియు భోజనం ఏర్పాటు.

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : ఫర్నిచర్ అసిస్టెంట్ మూడు నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఉపాధి పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం జిల్లా యువతకు కలెక్టర్ జితేష్ వి. పాటిల్, పిలుపునిచ్చారు.

దీనికి గాను నవంబర్ 6న కలెక్టరేట్‌లో డ్రాయింగ్‌పై టెస్ట్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమం ద్వారా యువత ఫర్నిచర్ ప్రొడక్షన్, ఇన్‌స్టలేషన్ మరియు మెషిన్ ఆపరేషన్ రంగాల్లో నైపుణ్యం సాధించి స్థిరమైన ఉద్యోగ అవకాశాలు పొందగలరని ఆయన చెప్పారు.

 

జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో 8 మంది గిరిజన యువత NSTI–FFSC, హైదరాబాద్‌లో శిక్షణ పూర్తి చేశారని, వారు ₹15,000 వేతనంతో అప్రెంటిస్‌గా ఉన్నారని తెలిపారు.

ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా రెండవ విడతకు 20 మంది అభ్యర్థులు ఎంపిక చేయబడనున్నట్లు కలెక్టర్  ఈ సందర్భంగా తెలిపారు.

ఒక బ్యాచ్‌ తరువాత మరో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు  ఆయన తెలిపారు.

 

ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 5 లోపు ఈ క్రింది గూగుల్ ఫారం ద్వారా లేదా క్యూ ఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

డ్రాయింగ్‌పై టెస్ట్ నవంబర్ 6, 2025 న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహించబడుతుందని,

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ నవంబర్ 15, 2025 నుండి NSTI–FFSC, హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని తెలిపారు.

 

అభ్యర్థుల అర్హతలు

 

⇒కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత.

⇒ 18 – 35 సంవత్సరాల వయస్సు.

⇒ డ్రాయింగ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత.

⇒ ఆధార్, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు తప్పనిసరి.

⇒ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్‌లు అభ్యర్థి మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి.

 

శిక్షణ పూర్తయిన తర్వాత నెలకు రూ.15,000 నుండి రూ.30,000 వరకు వేతనంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వివరించారు.

 

రిజిస్ట్రేషన్, వసతి మరియు భోజనం ఏర్పాటు

కాగా, రిజిస్ట్రేషన్ ఫీజు జిల్లా యంత్రాంగం తరపున అందించనుండగా,

Abhimanya Interio Pvt. Ltd. సంస్థ Managing Director దిలీప్ వర్మ CSR (Corporate Social Responsibility) పథకం కింద అభ్యర్థుల కోసం హైదరాబాద్‌లో వసతి మరియు భోజన సదుపాయం అందించనున్నట్లు కలెక్టర్ గారు తెలిపారు.

ఈ అవకాశాన్ని అర్హత గల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

 

నిపవలసిన గూగుల్ ఫామ్:

https://tinyurl.com/4zv2bn67

సంప్రదించవలసిన నెంబర్లు:

79958 06182  –  77994 70817

Facebook
WhatsApp
Twitter
Telegram