అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మండలంలోని చిరుమళ్ళ గ్రామ శివారులో 20 క్వింటాళ్ల ప్రజాపంపిణీ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై అధికారి శివకుమాక్లూర్ తెలిపారు. అక్రమంగా 20 కింటల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికార శివకుమార్ మాట్లాడుతూ…. కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ గ్రామ శివారులో 20 కింటల (పిడిఎస్) రేషన్ బియ్యం ట్రాక్టర్ పై పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తుండగా పక్క సమాచారంతో ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాక్టర్ లొ ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ , సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram