FASTag వినియోగదారులకు ముఖ్య గమనిక. ‘నో యువర్ వెహికల్’ (KYV) వెరిఫికేషన్ పూర్తి చేయకుంటే నవంబర్ 1 నుంచి మీ వాహనం FASTag చెల్లదు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో రెట్టింపు టోల్ చెల్లించాల్సి వస్తుంది.
ఎందుకంటే..?
పారదర్శకత పెంచడానికి, మోసాలను నిరోధించడానికి కేంద్రం ఈ చర్య చేపట్టింది. ఇప్పటివరకు ఒకే FASTagను వేర్వేరు వాహనాలకు ఉపయోగించడం, కొందరు జేబుల్లో పెట్టుకుని టోల్‌ను దాటడం వంటి లోపాల కారణంగా ఈ నిర్ణయం.
కొత్త నిబంధన ఏమిటి..?
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇప్పుడు KYVని తప్పనిసరి చేసింది. దీని అర్థం..
ప్రతి FASTag అది జారీ చేసిన వాహనంతో తప్పనిసరిగా అనుసంధానించబడాలి.
దీనివల్ల భారీ వాహనాల ట్యాగ్‌లను చిన్న వాహనాలపై ఉపయోగించడం కుదరదు. తక్షణమే మీ FASTag KYV వెరిఫికేషన్ పూర్తి చేయండి..!!
Post Views: 18









