నిజామాబాద్ జిల్లాలో కలకలం…. తల , చేయి నరికి మహిళ దారుణ హత్య.. తలలేని మొండెం తో కూడి నగ్నంగ మృతదేహం…ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు*
నవీపేట మండలం ఫకీరాబాద్ శివారులో ఘటన
తల, చేయి వేరుచేసి అతి కిరాతకంగా చంపిన దుండగులు
నెల రోజుల వ్యవధిలో రెండో హత్యతో స్థానికుల్లో భయం
వివరాల్లోకి వెళితే, దుండగులు మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేశారు. అంతేకాకుండా, ఒక చేయి, మరో చేతి వేళ్లను కూడా నరికివేశారు. మృతదేహం నగ్న స్థితిలో పడి ఉండటం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతురాలిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
కాగా, నెల రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో తమ భద్రతపై భయం నెలకొందని వారు వాపోతున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు









