కాశీబుగ్గ తొక్కిసలాటపై విచారణ

ఆంధ్రప్రదేశ్ : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు.

 

సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఇటు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష.. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Facebook
WhatsApp
Twitter
Telegram