మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు
గోల్డెన్ న్యూస్ /మణుగూరు : కాంగ్రెస్ పార్టీనాయకులు మణుగూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసి కార్యకర్తలపై దాడి చేసి తప్పు చేశారని. కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రైలర్ చూపించారని, మేము క్లైమాక్స్ చూపిస్తామని పినపాక మాజీ ఎమ్మెల్యే、 బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు。 సోమవారం హనుమాన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేగా కాంతారావు మాట్లాడారు. దాడులు చేసే సంస్కృతి మాది కాదని కాదన్నారు. మా పై కార్యకర్తలు దాడులు చేసి మంచి పని చేశారని సమర్ధించుకుంటున్నారని రేగా కాంతారావు అన్నారు. ఏదో విధంగా మాపై నిందలు వేసి తద్వారా లాభం పొందాలని చూస్తున్నారన్నారు. మమ్మల్ని చంపి ప్రయత్నం జరిగిందని ఇందులొ ఎలాంటి సందేహం లేదన్నారు. గులాబీ యువ సైనికులు అక్కడ ఉంటే వారిని విపరీతంగా కొట్టి వారే వాదన చేశారని ఫిర్యాదు చేసినందుకు సిగ్గు లేదా అన్నారు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనిని రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారని, ఇలాంటి వాళ్లని గెలిపించామని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. నీ తెలివితేటలు నా దగ్గర పని చేయవన్నారు. నీ ఇంటి ముందు రోడ్డుకు 12 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చానని, ఎంతమంది మహిళలు వృద్ధులు రోడ్డుపై కింద పడి గాయాల పాలవుతున్న కూడా నీ మనసు చెల్లించడం లేదన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముగ్గురు మంత్రులు స్పందించి డి ఎం ఎఫ్ టి నిధులు ఎటు పోతున్నాయో జిల్లా ప్రజలకు చెప్పాలన్నారు.నీ ఇంటి ముందు రోడ్డు వేసుకోవడం, ప్రజలకు చిన్నచితికా పనులు చేయడం కూడా చేతకాదన్నారు. 2026 నుండి ప్రతిపక్ష పాత్ర దద్దరిల్లిపోద్దని ఒక్క భద్రాద్రి జిల్లాలో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తే ఉలిక్కిపడి దాడులకు దిగుతున్నారన్నారు. రెండు సంవత్సరాల్లో తట్టెడు మట్టికి దిక్కు లేని ఏర్పడిందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. పచ్చని రాష్ట్రాన్ని చక్కటి జిల్లాని రక్తసిక్తం చేయాలని చూస్తున్నారని. ఇందులో భాగంగానే మణుగూరులో దాడికి పూనుకున్నారన్నారు. కార్యాలయానికి సంబంధించిన కాగితాలు ఉంటే చూపించాలని, అవి నిజమైనవి అయితే నేనే స్వచ్ఛందంగా అప్పగిస్తానన్నారు. చట్టం పరిధిలో ఏం చేయాలో వంద శాతం చేస్తానన్నారు. ఇప్పటికైనా దాడులు చేసే సంస్కృతిని మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.









