ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి

తన పుట్టినరోజు సందర్భంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన డాక్టర్ సుధీర్ కుమార్

గోల్డెన్ న్యూస్ / సూర్యాపేట : నూతనకల్ మండలం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మన అమ్మ హాస్పిటల్ ఎండీ,ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దాచేపల్లి సుధీర్ కుమార్ అన్నారు.మంగళవారం డాక్టర్ సుధీర్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా తాను చదువుకున్న నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రూ.50 వేల విలువ ప్యూరిఫైడ్ ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి మాట్లాడారు.తన పుట్టినరోజు సందర్భంగా తాను చదువుకున్న పాఠశాలపై మమకారంతో విద్యార్థుల కొరకు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు.తాము చదువుకున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేయూతని అందించాలని కోరారు.ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వరూపలక్ష్మీ, దాచేపల్లి అంజయ్య, పాఠశాల హెచ్ఎం అనంతుల కళావతి,టీచర్లు భాగ్యలక్ష్మీ, సవీందర్ రెడ్డి, ఏఏపీసీ చైర్ పర్సన్ ధర్మారపు వెంకటమ్మ, కొమ్మనబోయిన అనిల్, అనంతుల బిక్షపతి, శ్రీను, నాగలింగం, అశోక్, నాగిరెడ్డి, వెంకన్న, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram