తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. భారత సైన్యంలో చేరేందుకు తెలంగాణలో ‘అగ్నివీర్’రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ అగ్నివీర్ల నియామక ర్యాలీ ఈ నెల 10 నుంచి 22 వరకు హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనుంది.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ తదితర పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పదో తరగతి అర్హత ఉన్న వాళ్లు క్వాలిఫికేషన్ కు అర్హులు.
సంబంధిత నోటిఫికేషన్ ఇప్పటికే మార్చి 12 విడుదలై www.joinindianarmy.nic.in వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు బోర్డు తెలిపింది.
నియామక సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయాన్ని టెలిఫోన్ నంబర్లు
040-27740059, 27740205 , ఈ నెంబర్లను సంప్రదించవచ్చు.
Post Views: 27









