ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపండి: తుమ్మల

గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. భద్రాచలానికి అత్యంత సమీపంలో ఉన్న ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, పిచుకులపాడు, కన్నాయిగూడెం గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు. ఆ ఐదు గ్రమాల ప్రజల తీరని వెతలు తీర్చేల రెండు రాష్ట్రాల సీఎంలు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. ఏపీలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న తరుణంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram