రోడ్లు పై గుంతల మరమ్మత్తులు వెంటనే చేయాలి

రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి

-బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొండంత దూరం ఉందని,ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.

శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు కరకగూడెం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య రావుల సోమయ్య మాట్లాడుతూ…బయ్యారం(కరకగూడెం)-తాడ్వాయి

ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు దారి తీస్తుందని,రోడ్లు మరమ్మత్తులు చేయకుంటే ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆక్షేపించారు.జిల్లా మంత్రులు వెంటనే స్పందించి డిఎంఎఫ్ టి,సిఎస్ఆర్ నిధుల నుండి రోడ్ల పై ఏర్పడిన గుంతలను మరమ్మత్తులు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు.రోడ్లు మరమ్మత్తులు చేయకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తానని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కొమరం రాంబాబు,అక్కిరెడ్డి వెంకటరెడ్డి,రేగా సత్యనారాయణ,బైరిశెట్టి చిరంజీవి,పోగు వెంకటేశ్వర్లు,బుడగం రాము,గుడ్ల రంజిత్,అత్తె సత్యనారాయణ,మాజీ సర్పంచులు:ఊకే రామనాథం,పాయం నరసింహారావు,కొమరం విశ్వనాథం,కొమరం శ్రీను,భూక్య అర్జున్,గొగ్గల నారాయణ,పోగు ఎల్లగౌడ్,పఠాన్ యాకుబ్ ఖాన్,ఈసం సమ్మయ్య,పులి శ్రీధర్,యలగొండ శ్రీను,తోలెం రామారావు,మలకం వెంకటేశ్వర్లు,గుర్రం లాలు,సోషల్ మీడియా మండల అధ్యక్షులు సిద్ధి సునీల్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram