ప్రైవేట్‌ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: తమాషాలు చేస్తే.. తాట తీస్తానంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. “విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకుతెలుసు” అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. అరోరా కాలేజీ రమేష్కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి?. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా? అంటూ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Facebook
WhatsApp
Twitter
Telegram