చత్తీస్ ఘడ్ : లొంగిపోయిన ఏడుగురు మావోయిస్టులు

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ :  ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. శుక్రవారం  గరియాబంద్ జిల్లాలో ఏడుగురు మావోయిస్టు నేతలు ఆయుధాలతో సహా లొంగిపోయేందుకు వనం వీడి జనంలోకి వచ్చారు. ఉధంతి ఏరియా కమిటి కమాండర్ సునీల్, కార్యదర్శి అరీనా వీరులో ఉన్నారు. కమిటీ సభ్యులు లుడ్రాన్ విద్య, నందిని, మల్లేశ్ వీరితో కలిసి వచ్చినట్లు సమాచారం. వీరి వద్ద ఒక ఎస్ఎల్ఆర్, మూడు ఇన్సాస్ రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ ఆయుధాలు ఉన్నాయి. ఒకటి రెండు రోజుల్లో జిల్లా ఎస్పీ ముందు అధికారికంగా లొంగిపోతున్నట్లు సమాచారం.

Facebook
WhatsApp
Twitter
Telegram