నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవా
గోల్డెన్ న్యూస్ /చిట్యాల : నల్గొండ జిల్లాలో శనివారం
తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా.. అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉండగా.. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం ధాటికి ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ఇన్నోవా పూర్తిగా దగ్ధమైంది. హైవేపై అడ్డంగా వాహనం బోల్తా పడటంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పక్కకు తీసి.. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 19








