పొలాల్లో 2 వేల నాటు కోళ్లు పట్టుకోవడానికి ఎగబడ్డ జనం

గోల్డెన్ న్యూస్ /ఎల్కతుర్తి :  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు వేల నాటు కోళ్లను వదిలి వెళ్లారు. సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట పొలాల్లో వీటిని విడిచిపెట్టారు. దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గ్రామస్తులు ఈ కోళ్లను చూసి సంతోషించి, తమకు కావలసినన్ని కోళ్లను పట్టుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram