గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : ఉప్పల్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. మల్లికార్జున నగర్ ప్రాంతంలో నివసిస్తున్న శ్రీకాంత్(42).. ఫిలింనగర్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఇవాళ తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాంత్ 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్.
Post Views: 35








