జాతరకు వెళ్లేందుకు 100రూపాయలు ఇవ్వలేదని ఉరేసుకొని బాలుడు మృతి.
గోల్డెన్ న్యూస్ /మహబూబ్ నగర్ : హన్వాడ మండలం సల్లోనిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విజయ్ (7వ తరగతి) కార్తీక పౌర్ణమి రోజున స్నేహితులతో కలిసి కురుమూర్తి జాతరకు వెళ్లాలనుకున్నాడు. ఇందు కోసం తండ్రి శ్రీనివాసులును రూ.100 అడిగాడు. కానీ పనులు ఉన్నాయని నిరాకరించడంతో విజయ్ మనస్థాపం చెందాడు. తల్లి ప్రభావతి సర్దిచెప్పి డబ్బులు ఇప్పించినా.. అప్పటికే స్నేహితులు వెళ్లిపోయారు. దీంతో విజయ్ బాధతో పొలానికి వెళ్లి, అక్కడే చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయాడు…
Post Views: 23








