గోల్డెన్ న్యూస్ /నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ప్రధాన రోడ్డులోని శ్రీ శివరామ క్లాత్ స్టోర్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించింది. ఇల్లంతా పొగ ఆవరించడంతో ఊపిరాడక దుకాణం యజమానులు పైఅంతస్తు నుంచి పక్క ఫ్లాట్లోకి దూకి కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పెద్దమొత్తంలో నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
Post Views: 25








