స్వయం సహాయక సంఘాలకు ఉల్లాస్ -అమ్మకు అక్షరమాల

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలం గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ, (సెర్ప్) ఆధ్వర్యంలో ఉల్లాస్ -అమ్మకు అక్షర మాల కరకగూడెం మండలంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు, విద్యావంతురాలు అయ్యి తద్వారా ఆయొక్క కుటుంబాలు, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలి అనే, ఉద్దెశంతో అన్ని గ్రామాల్లో గుర్తించిన, నిరక్షరాస్యులకు చదవడం, వ్రాయడం, కార్యక్రమం వాలంటీర్లు ద్వారా నేర్పించుటకు, ఉల్లాస్ విద్యా కేంద్రాలు అన్ని గ్రామసమాఖ్యల పరిధిలో ప్రారంభం చేయుట ఇందులో భాగంగా మండల స్థాయి ఉల్లాస్ -అమ్మకు అక్షర మాల కమిటీ ఆధ్వర్యంలో చిరుమల్ల గ్రామంలో విద్యా తరగతులు ప్రారంభించుట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా వయోజన విద్యా డిప్యుటీ డైరెక్టర్ సీ. హెచ్ అనిల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వయం సంఘాల సభ్యులు ఈ కార్యక్రమం, సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా సామాజికంగా ఎదగాలని తద్వారా వారి కుటుంబాలలో పేదరికం, విద్య ద్వారానే నిర్మూలన చేసుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గడ్డం మంజుల, సేర్ఫ్ ఎపిఎం బి. వినోద్ క్రాంతి,ఎంపీఓ మారుతీ గ్రామపంచాయతి కార్యదర్శి రామక్రిష్ణ, సీసీలు విజయలక్ష్మి, సత్యనారాయణ, వివోఏలు ,పాలకవర్గ సభ్యులు, వాలంటీర్ లు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram