ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

గోల్డెన్ న్యూస్ /హనుమకొండ : జిల్లాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో డీడీజీ(స్టేట్స్), జోనల్ రిక్రూట్మెంట్ ఆఫీస్, చెన్నై, డైరెక్టర్ రిక్రూటింగ్, ఏఆర్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీశ్ జెండా ఊపి ప్రారంభించారు. ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల నుంచి అభ్యర్థులకు రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రెండు జిల్లాల నుంచి 794 మంది రాత పరీక్షలో అర్హత సాధించగా.. 624 మంది హాజరై హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో ఫిజికల్ ఫిట్నెస్, ఇతర పరీక్షల్లో పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram