ఆధార్ కార్డును ప్రతిసారీ వెంటపెట్టుకుని వెళ్లాల్సిన పనిలేకుండా.. డిజిటల్ రూపంలో పొందే సౌలభ్యం ఇందులో ఉంటుంది. వ్యక్తిగత వివరాలతో పాటు కుటుంబ సభ్యులందరి వివరాలూ ఇందులో పొందవచ్చు. వీటితో పాటు ఫేస్ అథంటికేషన్ ఫీచర్ ఇందులో అదనం. ఆధార్‌లో పొందుపరిచిన అన్ని వివరాలు కాకుండా ఎదుటివారు ఏవైతే వివరాలు అడిగారో వాటిని మాత్రమే విడిగా షేర్ చేస్కోవడానికి ఈ యాప్ అత్యంత అనుకూలం. వీటన్నిటికీ లాక్ ఫీచర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ డేటాను చివరిసారిగా ఎక్కడ వినియోగించామో సులభంగా తెలుసుకోవడంతో పాటు లాకింగ్, అన్‌లాక్ సదుపాయం కూడా కల్పించారు.
ఉపయోగించే విధానం..
▪️ముందుగా.. అండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
▪️యాప్‌నకు సంబంధించి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. తర్వాత Terms and Conditions ను యాక్సెప్ట్ చేయాలి.
▪️ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి. దీంతో ఫోన్ నంబర్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.
▪️ఆ తర్వాత ఫేస్ అథంటికేషన్ కోసం సంబంధిత రూల్స్ పరిశీలించి ఫాలో అవ్వాలి.
పై వివరాలన్నీ ఎంటర్ చేశాక సెక్యూరిటీగా పిన్ సెట్ చేస్కోవాలి.








