ఏపీ పైబర్ నెట్ కేసులో కీలక పరిణామం, నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి..

ఏపీ పైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాప్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌తోపాటు, కనుమూరి కోటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు 7 ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

 

ఈ కేసుపై విచారణ చేసిన న్యాయమూర్తి.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో వివిధ ఆస్తులు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు.మొత్తం రూ.114 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌కు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ, ఏసీబీ కోర్టును నవంబర్‌ 6వ తేదీన ఆశ్రయించింది. టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. అంతకు ముందు సీఐడీ ఈ అంశంపై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది.

 

నిందితులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణలో ఉన్న మొత్తం ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతివ్వాలని పిటిషన్‌లో సీఐడీ కోరింది. ఈ జాబితాలో టెరాసాఫ్ట్‌ కంపెనీతోపాటు చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తులు ఉన్నాయి. వీటిని అటాచ్‌ చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.

 

ఆస్తుల వివరాలు ఇవి

 

1. తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇళ్లు, వ్యవసాయ క్షేత్రాలు

 

2. నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు. మొత్తంగా అటాచ్‌ చేసే ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి.

 

3. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫైబర్ నెట్ కుంభకోణంలో రూ. 114 కోట్లు దుర్వినియోగమయ్యామని సీఐడీ ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 గా వేమూరి హరికృష్ణ, ఏ-11 గా టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేర్లు ఉండగా.. చంద్రబాబు పేరును ఏ-25 గా సీఐడీ చేర్చింది.

 

ఇక మద్యం కంపెనీలకు అనుమతుల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తరఫున న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. ‘‘మద్యం కంపెనీలకు అనుమతుల సమయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రివిలేజ్‌ ఫీజు కూడా నిబందనల మేరకే తీసుకున్నారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారు’’ అని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సీఐడీ తరఫు న్యాయవాది బుధవారం వాదనలు వినిపించనున్నారు.

Recent News :

Mohammed Rafee

Mohammed Rafee

Admin

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram