బండి సంజయ్‌ రాజీనామా తర్వాత బీజేపీ గ్రాఫ్‌ ఏమీ తగ్గలేదు -ఈటల రాజేందర్‌ ..

బండి సంజయ్‌ రాజీనామా తర్వాత బీజేపీ గ్రాఫ్‌ ఏమీ తగ్గలేదని బాంబు పేల్చారు హుజురాబాద్ బీజేపీ ఎమ్యెల్యే ఈటల రాజేందర్‌. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. జెండాకు ఓనర్‌ అంటేనే పార్టీ బతుకుతుంది. నేను బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లలేదు, నన్ను వెళ్లగొట్టారని ఆరోపణలు చేశారు.

 

 

బీజేపీలో పార్టీ హైకమాండ్‌ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందన్నారు. బండి సంజయ్‌ రాజీనామా తర్వాత బీజేపీ గ్రాఫ్‌ ఏమీ తగ్గలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌పై నేను ఎలాంటి నివేదికలు హైకమాండ్‌కు ఇవ్వలేదన్నారు ఈటల రాజేందర్‌. రాజేందర్‌ కులపరంగా ఎదగలేదు, ఉద్యమబిడ్డగా ఎదిగాడన్నారు. నేను ఫైటర్‌ కాబట్టే.. కేసీఆర్‌ నాకు అవకాశమిచ్చారని పేర్కొన్నారు ఈటల రాజేందర్. ఏ పదవి ఇచ్చినా.. ఆ పదవికి వన్నె తెచ్చానని వివరించారు. ఏ పోరాటాలతో తెలంగాణ వచ్చిందో, ఆ పోరాటాల్నే కేసీఆర్‌ వద్దన్నారని మండిపడ్డారు. 2017లో నాకు, కేసీఆర్‌కు కొట్లాట మొదలైందని స్పష్టం చేశారు నేను భూకబ్జా చేసినట్టు, ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నట్టు నిరూపించండి. నాపై 365 రోజులు.. 360 డిగ్రీల్లో పూర్తి నిఘా ఉంటుందనరు ఈటల రాజేందర్‌.

Facebook
WhatsApp
Twitter
Telegram