మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 13 మంది మృతి..!

మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. టెంగ్‌నౌపాన్ జిల్లా సైబాల్ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారు లీతూ గ్రామానికి చెందిన వారు కాదని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. వేరే ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చి మరో తెగకు చెందిన గ్రూపుతో ఘర్షణతో దిగారని పేర్కొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram