ఏపీలో ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు నూతన కార్డులు మంజూరు చేయనుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ 25 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం అమలు కు ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతీ ఇంటిలో ఒకిరకి ఆరోగ్యశ్రీ యాప్ తప్పనిసరి చేసింది. ప్రతీ ఇంటికి వెళ్లాలని నిర్దేశించింది.
ఆరోగ్యశ్రీ నూతన కార్డులు: ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలులో పలు నిర్ణయాలు అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నూతన కార్డులను మంజూరు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతీ ఇంటికి సచివాలయ – ఆరోగ్య సిబ్బందిని పంపాలని డిసైడ్ అయింది. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ బ్రోచర్లను పంపిణీ చేయడం, నూతన లబ్ధిదారులను గుర్తించడం, కొత్త కార్డులను ఇవ్వడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష గురించి అవగాహన కల్పించనున్నారు.
AP Government issues latest guide lines for Aarogyasri new cards and on jagananna Arogya Suraksha
దిశ యాప్ తరహాలో రూపొందించిన ఆరోగ్యశ్రీ యాప్‌ను కూడా ఇంటిలో ఒకరి మొబైల్ నెంబర్‌కు డౌన్‌లోడ్ చేయాల్సిఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మార్గదర్శకాలు జారీ: ఇదే సమయంలో కొత్త కార్డులనుకూడా జారీ చేయాలని నిర్ణయించింది. ఇంటింటికి వెడుతున్న సిబ్బంది వీటిపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఇంటి యజయాని ఇకెవైసి తీసుకునే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల గురించి కూడా వీరు ప్రచారం చేయనున్నారు.
నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేది మద్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్‌బికె భవన్‌లలో ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లబ్ది దారులను సమీకరించాలని ప్రభుత్వం పేర్కొంది.
పరిమితి రూ 25 లక్షలకు పెంపు: అదేవిధంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా పాల్గనాలని ఆదేశించింది. స్థానిక శాసనసభ్యులు 19 వ తేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒకటి నుండి జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జనవరి 1వ తేదీ నుంచి కొనసాగించాలని, వారంలో మండలానికి ఒక వారంలో ఆరోగ్య శిభిరాలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది.
గ్రామాలు, వార్డుల్లో ఆరోగ్య శిభిరాలు నిర్వహించడం 6నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలన్నారు. ఆరోగ్య శిబిరాలు ఏ గ్రామంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఆయా గ్రామ వార్డు సచివాలయానికి మూడు రోజులు ముందు సమాచారాన్ని ప్రభుత్వం పంపనుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీలు వీటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.