అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి ఐఏఎస్ అర్జీలను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ రామకృష్ణరెడ్డి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ,వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి 363 అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించడంపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసి లబ్ధిదారుని సంప్రదించి నాణ్యత కలిగిన పరిష్కారం చూపించడం అధికారుల బాధ్యత అన్నారు. గడువులోపు ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
