విధి నిర్వహణలో ఎన్నో సేవలు అందిస్తూ ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటూ పోలీసు అమరవీరుల దినం జరుపుకుంటున్నాము. దేశ అంతర్గత భద్రతలో పోలీసులు పాత్ర కీలకమైనది. బాధ్యతాయుతమైనది. శాంతి భద్రతల పరిరక్షణ, సమాజ ప్రశాంతత కోసం 24×7 శ్రమిస్తున్నారు. న్యాయశాఖ, ఇతర ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పోలీసులు పని చేస్తున్నారు. నేరాల నియంత్రణ, ముద్దాయిలకు శిక్షలు పడేలా కృషి చేస్తున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు కారుణ్య నియమాకాలు, అందాల్సిన బెన్ఫిట్స్ అందజేయడం జరుగుతోంది. ప్రజలకు, సమాజానికి సేవ చేయడానికి యూనిఫాం సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతోంది. కానిస్టేబుల్ నుండీ ఐ.పి.ఎస్ అధికారుల వరకు ఉద్యోగంలో చేరే ముందు అందరూ ఒకే తరహా ప్రతిజ్ఞ చేస్తారు. ఆ ప్రతిజ్ఞ సారాంశానికి అనుగుణంగా విధుల్లో నిరంతరం ప్రజలు, సమాజం కోస పని చేద్దామని డి.ఐ.జి డాక్టర్ షిమోసి IPS
