750 కేజీల గంజాయి దగ్ధం.

గోల్డ్ న్యూస్ భద్రాచలం 6 నవంబర్

రూ. 1.87 కోట్ల విలువ గంజాయి దహనం

భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని 34 కేసుల్లో పట్టుబ డిన రూ.1.87 కోట్ల విలువ చేసే 750 కిలోల గంజాయిని బుధవారం భద్రాచలం ఎక్సైజ్‌ పోలీసుల ఆధ్వర్యంలో AWMన్సటింగ్‌ లిమిటెడ్‌ తల్లేడ మండలం గోపాల్‌పేట్‌ గ్రామంలో ప్రభుత్వ అనుమతి పొందిన దహన కేంద్రాంలో  దగ్ధం చేయించారు. గంజాయి  దహనం చేసే సమయంలో అధికారులు ఖమ్మం డిప్యూటి కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి, అసిస్టేంట్‌ కమిషనర్‌ గణేష్‌, భద్రాది కొత్తగూడెం ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ జనాయ్య, భద్రాచలం ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రహీమ్‌ ఉన్నీషా ఉన్నారు. గంజాయి దగ్ధం చేయించిన సిబ్బందిని ఖమ్మం జి ల్లా ఎక్సైజ్‌ పోలీసులను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ వి.బి. కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram