గోల్డెన్ న్యూస్ కరకగూడెం 6 నవంబర్
పినపాకలో పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మహబూబాబాద్ పార్లమెంటరీ అలహాగ్ కమిటీ కన్వీనర్ కొండపల్లి రామచందర్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు సిరి శెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో టిడిపి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామచందర్ మాట్లాడుతూ..100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే ప్రమాదం జరిగి మరణిస్తే నామినీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని. తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఇస్తామని అన్నారు. నియోజకవర్గం లో టిడిపికి పూర్వ వైభవం తెస్తామని అన్నారు. స్థానిక సంస్థల్లో టిడిపి సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Post Views: 87