ఘనంగా బాలల దినోత్సవం

పినపాక:భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినాన్ని పురష్కరించుకొని పినపాక మండలం ఏడుల్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని  ఎక్సలెంట్ భాషా ఇంగ్లీషు మీడియం‌ హైస్కూల్ లో బాలల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే దేశ నాయకుల వేషాధారణలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎడ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాదారు చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాదని, ఆటలు, పాటలు, చిత్ర లేఖనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యలో భాగమేనని అన్నారు. విద్యార్ధులు మొబైల్‌ ఫోన్‌కు దూరంగా ఉండి పుస్తకానికి దగ్గర అవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు ఖాదర్, యాకుబ్ షరీఫ్, యూసఫ్ షరీఫ్ ,నర్సారెడ్డి, నరేందర్ ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram