రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కేసులు

 గోల్డ్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం /పినపాక : రహదారులపై ధాన్యం ఆరబోస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రాజ్ కుమార్ హెచ్చరించారు. ఏడూల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆదేశాలతో ఎస్సైఇ .రాజ్ కుమార్ శనివారం పినపాక మండల పరిధిలోని పలుగ్రామాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి కిందపడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ధాన్యం ఆరబోతలకు కల్లాలను మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram