హనుమకొండలో ప్రజా పాలన పాజయోత్సవ సభ

హనుమకొండ : ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవ సభ. ఆక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ఇటీవలే నిర్మాణం పూర్తైన నయూంనగర్ వంతెన, రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేశారు. బహిరంగ సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి.. హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించారు.. మహిళా శక్తి మేళాను ఎంపీ  కడియం కావ్య ప్రారంభించారు. కాళోజీ కళాక్షేత్రం, ఆర్ట్ గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి ఆర్ట్ కళాశాలలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకున్నారు. మహిళా శక్తి మేళాను సందర్శించడంతో పాటు మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులను పంపిణీ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram